ఫ్లాష్.. ఫ్లాష్ ..ధర్మపురి ఆలయంలో భక్తుడి పై దాడి !

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి

ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఓ భక్తుడిపై ఆలయ

ఉద్యోగి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి మరి కొందరు కలిసి శుక్రవారం

దాడికి పాల్పడ్డారు.


విశ్వసనీ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
ఆలయంలో స్వామివారి నిత్యాన్నదానంలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తుడు భోజనం చేస్తూ, బియ్యం దొడ్డుగా ఉన్నాయి, అంటూ అక్కడ విధులు నిర్వహించే వారిని, వంట చేసిన వ్యక్తిని అడిగినట్టు సమాచారం. వారు తమకు ఏమీ తెలియదని, పైన ఆఫీసులో ఫిర్యాదు ఫిర్యాదు చేయమని భక్తుడికి వివరించినట్టు సమాచారం.

ఈ దశలో ఆలయ ఉద్యోగి ఒకరు అన్నదానం జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు దొడ్డు బియ్యం అంశాన్ని భక్తుడు ఆ ఉద్యోగికి వివరిస్తూ ఉద్యోగి తో నీ పేరేమిటి, హోదా ఏమిటి అని ప్రశ్నించినట్లు సమాచారం. దాంతో ఆ ఉద్యోగి పైన ఆఫీస్ కి వచ్చి ఫిర్యాదు చేయండి అంటూ వెళ్లినట్టు సమాచారం. ఈ దశలో భక్తుడు పై అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు యత్నంలో ఉండగా ఉద్యోగి కీ భక్తుడి కి కార్యాలయంలో తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు తెలిసింది.

భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి మెట్లు దిగి కిందికి రాగా ఆలయ ప్రాంగణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో భక్తుడిని ఉద్యోగి మరికొందరు కలిసి చితకబాదినట్లు తెలిసింది.
భక్తుడి కుటుంబ సభ్యులు కొట్టవద్దు అని వేడుకుంటూ ఆలయం బయటకు వెళ్ళగా ఆలయ బయట (రాజు గోపురం ) ముందు కు ఉద్యోగి తిరిగి వచ్చి భక్తుడి కాలర్ పట్టుకొని మరోసారి కొట్టినట్టు తెలిసింది.

భక్తుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారని, నిత్యాన్నదానంలో దొడ్డు బియ్యం ఉన్నాయి అంటే దాడి చేస్తారా ? అని భక్తుడీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శాపనార్థాలు పెట్టారని సమాచారం.
ఆలయ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో ? పోలీసు అధికారులు సుమోటోగా కేసు నమోదు చేస్తారో ? వేచి చూడాల్సిందే.


సి సి ఫుటేజ్ లో మాయం ?


భక్తుడి పై దాడి జరిగిన సంఘటన నేపథ్యంలో కొందరు ఉద్యోగులు అతి ఉత్సాహం ప్రదర్శించి ఆలయ ప్రాంగణంలోని సిసి ఫుటేజీలలో ఈ దృశ్యాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.