గంజాయి తో సహా ఇద్దరి అరెస్ట్, రెండు కిలోలు స్వాధీనం !


👉జగిత్యాల DSP రఘు చందర్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి పోలీసులు చాకచక్యంగా పక్క ప్రణాళికతో గంజాయితో సహా ఇద్దరిని పట్టుకుని రిమాండ్ చేస్తూ రెండు కిలోల గంజాయి స్వాధీన పరుచుకున్నట్టు జగిత్యాల్ డిఎస్పి రఘు చందర్ తెలిపారు.


ధర్మపురి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం డి.ఎస్.పి మీడియాకు వివరించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు తన  ఆద్వర్యం లో,  ధర్మపురి CI రామ్ నరసింహా రెడ్డి,  SI.ఉదయ్ కుమార్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నట్టు తెలిపారు.


బత్తిని చందు s/o సత్తయ్య, 23 సంవత్సరాలు, కులం ముదిరాజ్, గ్రామం రాయపట్నం, మండలం ధర్మపురి మరియు గొల్ల వెంకటేష్ s/o తిరుపతి,  25 సంవత్సరాలు, కులం పేరుక, గ్రామం రాయపట్నం, పట్టుబడినట్టు తెలిపారు.
బత్తిని చందు తన హోండా DIO మోటార్ సైకిల్ B.No.TS07 JM 3091 మోటార్ సైకిల్ సీటు కింద గంజాయిని పెట్టుకోగా,  గొల్ల వెంకటేష్ తన హోండా షైన్ B.No.TS21E 2963 మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్  కవర్లో  గంజాయిని పెట్టుకోని ఎవరికైనా విక్రయించుదామని ధర్మపురి వైపు వస్తుండగా బుధవారం సాయంత్రం   ధర్మపురి HP పెట్రోల్ పంప్ వద్ద ధర్మపురి CI, రాం నరసింహా రెడ్డి   ధర్మపురి SI ఉదయ్ కుమార్, సిబ్బంది ASI సూర్య నారాయణ రాజు , హెడ్ కానిస్టేబుల్స్- శంకర్, వెంకటయ్య,  రామ స్వామి, కానిస్టేబుల్స్  రమేష్, నవీన్ కుమార్, .రమేష్ నాయక్  ఆ ఇద్దరిని పట్టుకున్నట్టు డి.ఎస్.పి వివరించారు.


పట్టుబడిన వారి నుండి 2.070 kgs గంజాయి, రెండు సెల్ ఫోన్లు, మరియు రెండు మోటార్ సైకిళ్లు, పట్టుబడిన గంజాయి విలువ ₹.40,000/- వుంటుంది.  పరారీలో మరో నిందితుడు  ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు.