గ్రహణం వీడిన ధర్మపురి తెలుగు కళాశాల ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ చొరవతో !

👉సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు !

👉బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో కళాశాల మూసివేత!

👉కళాశాల నిర్వహణకు ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం!

👉ఎమ్మెల్యే నిధులు నుంచి కళాశాలకు ₹ 5 లక్షల కేటాయింపు !

👉ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం!


J.SURENDER KUMAR,

దశాబ్దాల చరిత్ర గల ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ

సంస్కృతాంధ్ర కళాశాలకు (నైట్ కాలేజి) గ్రహణం వీడి

శుక్రవారం మహర్దశ పట్టింది.

స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రత్యేక శ్రద్ధ

వహించి కళాశాల తిరిగి పున ప్రారంభించడానికి,

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కు

ఉత్తర తెలంగాణ జిల్లాలలో తెలుగు కళాశాల

ఆవశ్యకతను వివరించారు.

స్పందించిన ప్రభుత్వం శుక్రవారం కళాశాల నిర్వహణకు నిధులు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన లెక్చరర్ల నియామకం, వారికి జీతభత్యాలు చెల్లించడానికి, ప్రతి సంవత్సరం ₹ 32 లక్షల రూపాయలను ధర్మపురి, వేములవాడ, కొండగట్టు, యాదగిరిగుట్ట ఆలయాలు నిధులు కేటాయిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కోర్సులు సైతం ఈ కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిని రామ శైలజ అయ్యంగార్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు.

👉సీఎంకు రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడిన తెలుగు కళాశాలను తిరిగి తెరిపించడానికి ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కళాశాల నిర్వహణకు నిధుల సమీకరణకు విధానాలను వివరించిన ఐటి, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, సీఎం ఓ ఎస్ డి, వేముల శ్రీనివాస్ కు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, సహకరించిన అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉మౌలిక వసతుల కల్పనకు ఐదు లక్షలు కేటాయింపు !

మూతపడిన తెలుగు కళాశాల లో మౌలిక వసతుల కల్పన, శానిటేషన్, రంగులు, విద్యుత్తు వైరింగ్, తదితర అత్యవసర వసతుల కల్పనకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కళాశాలకు ₹ 5 లక్షలు కేటాయించారు.

👉ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు, స్వరాష్ట్రంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !

ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ మాజీ దేవాదాయ శాఖ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు, ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయల అభివృద్ధికి నాడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి లక్షలాది రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు,

👉స్వరాష్ట్రంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్..

నిరుద్యోగ యువత పాలిట కామధేను లాంటి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సంస్కృత ఆంధ్ర కళాశాల ( నైట్ కాలేజ్ ) గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021 లో నిధుల కొరతతో మూతపడింది. తెలుగు కళాశాల మూసి వేయడం పట్ల నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పై ధర్మపురి ప్రజలు, విద్యార్థి లోకం, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మభ్య పెట్టడానికి మూత పడిన కళాశాలకు ‘ న్యాక్ శిక్షణ కేంద్రం ‘ పేరిట బోర్డు తగిలించి నాటి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, శిక్షణ కేంద్రం ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రం మూడు నెలలకే మూత పడింది.


👉ఎన్నికల హామీ అమలు ..


2023 శాసనసభ ఎన్నికల్లో అడ్డూరి లక్ష్మణ్ కుమార్, తాను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరం లోపు తెలుగు కళాశాలను ( నైట్ కాలేజ్ ) ఖచ్చితంగా తెరిపిస్తానని ధర్మపురి ఓటర్లకు, యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆరు మాసాల్లో నెరవేర్చారు.


👉60 రోజుల్లో ఆర్డర్ ….
కళాశాల ఫైల్ కదిలింది ఇలా..

తెలుగు కళాశాల


పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కళాశాల తిరిగి ప్రారంభించడానికి ఉత్తర్వుల జారికి 60 రోజుల సమయం పట్టింది. మే మాసంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మంత్రి శ్రీధర్ బాబుకు కళాశాల పరిస్థితి వివరించి కళాశాల ను తెరిపించడానికి వినతి పత్రం ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు లేక సంఖ్య 1390/ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్ డి మే 27న, జూన్ 24న ప్రభుత్వానికి నోట్ ఫైల్ పెట్టారు. జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ జూన్ 26 న ప్రభుత్వానికి నివేదిక పంపించారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జూన్ 29 కళాశాలను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సీఎం రేవంత్ రెడ్డి జులై 2న అధికారుల నోట్ ఫైల్ ను ఆమోదించారు. శుక్రవారం ( జూలై 5 ) న ప్రభుత్వ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


👉హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు విద్యార్థి లోకం !


ఉత్తర తెలంగాణ జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగ యువతకు కామదేనువుగా శ్రీ లక్ష్మి నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలగా ( నైట్ కాలేజ్ ) ధర్మపురిలో కొలువైంది.
గత మూడు సంవత్సరాల క్రితం మూతపడిన కళాశాల తెరవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పట్టణ ప్రజలు విద్యార్థులకు యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్భవించిన పవిత్ర సంస్థ ఈ కళాశాలకు పూర్వ వైభవంతో కిట కిటలాడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.