J.SURENDER KUMAR,
త్వరలోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మాణం చేపట్టి పేద ప్రజలకు అందించడం జరుగుతుందనీ, ప్రభుత్వం పెద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందనీ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ₹ 22 లక్షల విలువ గల 29 కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటిలలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిధి పెంపు వంటి పథకాలను అమలు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉మర్యాద పూర్వకంగా…

ధర్మారం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన SI పదవీ బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్, సోమవారం ధర్మపురి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
👉నష్టపరిహారం చెల్లించాలి…

వెలగటూర్ మండలం చేగ్యం ముంపు ప్రాంత కుటుంబాలకు, నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతూ సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్ మండల నాయకులతో కలసి జిల్లా కలెక్టర్ ను కలిసి పరిస్థితిని వివరించి యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం చెల్లించాలని కోరారు.