J.SURENDER KUMAR,
లోక కల్యాణార్ధము ఈనెల 9న సిరిసిల్ల జిల్లా బోయిన్ పెల్లి మండలం వరద వెళ్లి గ్రామ, గుట్టపై స్వయంభు రాహు రూప ( సర్ప రూప) శయన దత్తాత్రే యుడి ఆలయంలో శ్రీ దత్త హోమం జరగనున్నది.
నవకోటి దత్త హోమము లోని అంతర్భాగము గా, లోక కల్యాణార్ధము జరుగుతున్న 7 వ కోటి లోని భాగంగా, “దత్త హోమము”
అవధూతదత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శిష్య బృందం హోమమును నిర్వహించనున్నారు. ఈ హోమ దర్శనము, మంత్ర శ్రవణము శుభప్రదము అని భక్తులు పాల్గొనగలరని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.
👉 కొదురుపాక రింగ్ రోడ్డు నుండి ఈ ఆలయం 3 కిలోమీటర్లు దూరంలో ఉంది.

👉 కోరికలు తీర్చే దత్తాత్రేయుడి గా భక్తులకు ఎనలేని నమ్మకం !
వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రే యుడు, ప్రపంచం లోనే అతి అరుదైన, వింతైన ఈ వరదవెల్లి రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడి ని సమస్యల పరిష్కారం కోసం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకుంటారు. అనే ప్రచారంలో ఉంది.

👉 తొందరగా తెమలని కోర్ట్ కేసులు ఉన్నవారు
👉 వయసు పెరిగినా ఉద్యోగంలో సెటిల్ అవ్వనివారు
👉 రాహు మహర్దశలో ఉన్నవారు
👉 భర్త ఒక చోట ఉద్యోగంలో భార్య, పిల్లలు మరొక చోట ఉన్నవారు, లేదా భార్య ఒక చోట ఉద్యోగంలో భర్త,పిల్లలు మరొక చోట ఉన్నవారు
👉 ఉద్యోగ బదిలీలు కావాలనుకునేవారు
👉 ఆఫీస్ పాలిటిక్స్ లో పైచేయి / విజయం సాధించాలనుకునే వారు…
👉 దొంగతనం మొదలైన అభాండాలు మీదపడ్డవారు..
👉 తరచుగా అబార్షన్లు / సంతన నష్టం కలిగిన
వారు…
👉 ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు దత్తాత్రేయుడు పడుకుని రాహు రూపంలో ఉండడం…
👉 దత్తత్రేయునికి ప్రతీకగా నేటికి ఉన్న వందల ఏళ్ళ నాటి నింబవృక్షాలు.. ఒక వృక్షం ఆకు కొంచెం తీపిగా, మరో వృక్షం ఆకు ఒగురు గా మూడో వృక్షం ఆకు చేదుగా, ఉండడం దత్తాత్రేయుని మహన్వితం గా భక్తజనం భావిస్తారు.

👉 వరదవెల్లి రాహురూప (సర్పరూప ) శయన దత్తాత్రేయుడిని ఫోటో తీసినప్పుడు విగ్రహం లో దాగిఉన్న జంట సర్పాల ఆనవాళ్ళు కనిపించడం
👉 దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో ‘దత్త వెంకటేశ్వరస్వామి’ గా పిలవబడడం…
👉 క్షేత్రానికి మానేరు నది బ్యాక్ వాటర్ 3 వైపులా నీరు ఉండడం

అత్యంత అరుదైన రాహురూప (సర్పరూప) శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇటు వంటి క్షేత్రం ప్రపంచంలో మరెక్కడాలేదు. అనేది భక్తజనం మాట..
ఈ దత్తక్షేత్రం ప్రాంగణం లోనే దత్తాత్రేయుడు వేంకటేశ్వర స్వామి రూపంలో ‘దత్త వేంకటేశ్వర స్వామి’ గా కుడా వెలిశారు. దత్త వేంకటేశ్వర స్వామి గుడి కుడా ప్రపంచంలో ఇదొక్కటే అని, ఆలయ అర్చకులు, భక్తజనం వివరిస్తుంటారు.

