24 గంటలు వైద్య సేవ అందుబాటులో ఉంటాయి !

J.SURENDER KUMAR,


జ్వరాలు ఆ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, 24 గంటలపాటు సేవలు అందించడానికి వైద్యాధికారులు సిబ్బంది అందుబాటులో ఉన్నారు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు


ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన గ్రామస్తులు
గత వారం రోజులుగా విష జ్వరాలతో బాధపడుతుండగా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో శనివారం జిల్లా వైద్య అధికారులు సిబ్బందితో కలిసి పర్యటించారు. జ్వరం బారిన పడిన వారిని పరామర్శించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..


పత్తిపాక గ్రామంలో జ్వరాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ ను మరియు జిల్లా వైద్యాదికారులను అప్రమత్తం చేసి గ్రామానికి రప్పించడం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జ్వరాలు, వ్యాధులు నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.