జగిత్యాల బీఆర్ఎస్ ఇన్చార్జిగా దావా వసంత? రమణ రావు?

J.SURENDER KUMAR,

జగిత్యాల అసెంబ్లీ భారత రాష్ట్ర సమితి ఇన్చార్జిగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత,? లేదా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఓరగంటి రమణ రావు ? లలో ఒకరిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉందనేది చర్చ.

సోమవారం జగిత్యాల పట్టణంలోనీ పద్మనాయక కళ్యాణమండపంలో జరగనున్న ఆ పార్టీ నాయకుల, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.


జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వారం రోజుల క్రితం, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ను స్థానిక కాంగ్రెస్ పార్టీ చోట మోట లీడర్లను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఉదంతంపై టిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆగ్రహంతో ఉన్నట్టు చర్చ. బలమైన బీసీ సామాజిక వర్గం నేపథ్యంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, పేరు పరిశీలించినట్లు చర్చ.

వివాద రహితురాలుగా, సొంత పార్టీలో ప్రతిపక్ష పార్టీలలోనూ గుర్తింపు ఉంది. గతంలో ఆ పార్టీకి చెందిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన భోగ శ్రావణి ఆ పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం జగిత్యాల బిజెపి పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు.

ఈ నేపద్యంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత పేరు తెరమీదికి వచ్చినట్టు చర్చ. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కెసిఆర్ వెన్నంటే ఉండి జగిత్యాలలో పార్టీ కోసం ఆర్థిక వనరులు సమకూర్చిన ఆ పార్టీ నాయకుడు జగిత్యాల ఎంఎల్ఏ టికెట్ ఆశించి బంగపడ్డా, రమణారావుకు 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మొండి చెయ్యి చూపింది. నష్ట నివారణ చర్యలలో భాగంగా ఇంచార్జ్ బాధ్యతలు ఆయనకు అప్పగించే అవకాశాలు సైతం ఉన్నాయనే చర్చ ఉంది.

దీనికి తోడు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ ఇంచార్జ్ మాజీ అధ్యక్షుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు పాలెపు రాజు సైతం ఇన్చార్జి బాధ్యతల కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూ, కెసిఆర్ కేటీఆర్ లను కలిసినట్టు చర్చ. నేటి ఆత్మీయ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంచార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారో, లేదా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.