జగిత్యాల జిల్లాలో 19 వేల మంది రైతుల కు రుణమాఫీ !

👉రైతుల ఖాతాలోకి రెండవ విడత ₹169 కోట్ల రూపాయలు జమ !

👉కలెక్టర్ బి సత్యప్రసాద్ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లాలో మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న 39 వేల 229 మంది రైతుల ఖాతాల్లో ₹ 207 కోట్లు ప్రభుత్వం గతంలో జమ చేసిందని అన్నారు. మంగళవారం లక్షన్నర వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తుందని, మన జగిత్యాల జిల్లాలో రెండో విడత 19 వేల 623 మంది రైతులకు సంబంధించి ₹ 169 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు.


రెండవ విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత జగిత్యాల జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ


రెండవ విడతలో రైతు రుణమాఫీ జరిగిన లబ్ధిదారుల బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకుని రుణమాఫీ సొమ్మును వారి సేవింగ్స్ ఖాతాలలో జమ చేయాలని, దీనికోసం బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.


రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాణి, జిల్లా సహకార అధికారి రఘువరన్, ఎల్డీఎం రాం కుమార్, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు రైతులు ప్రజా ప్రతినిధులు వ్యవసాయ విస్తరణ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.