👉జాతీయ ప్రసార దినోత్సవం..
భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసారం 23 జూలై 1927న బొంబాయి స్టేషన్ నుంచి జరిగింది. అప్పటి ప్రైవేట్ సంస్థ అయిన ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఐబీసీ) ఈ ప్రసారం చేసింది. అందుకే జూలై 23ను జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటారు.
రేడియో తరంగాల ఉనికిని మొదటిసారిగా జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ 11 నవంబర్ 1886న నిరూపించారు. 1890ల మధ్యకాలంలో, భౌతిక శాస్త్రవేత్తలు విద్యుదయస్కాంత తరంగాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే సాంకేతికతలపై ఆధారపడి, గుగ్లీల్మో మార్కోనీ సుదూర రేడియో కమ్యూనికేషన్ కోసం మొదటి ఉపకరణాన్ని అభివృద్ధి చేశారు.

1895లో ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గ్రహీతకు వైర్‌లెస్ మోర్స్ కోడ్ సందేశాన్ని పంపడం , మరియు 12 డిసెంబర్ 1901న మొదటి అట్లాంటిక్ సిగ్నల్. మొదటి వాణిజ్య రేడియో ప్రసారం 2 నవంబర్ 1920న ప్రసారం చేయబడింది. భారత దేశానికి చెందిన ప్రముఖ శాస్త్ర వేత్త జగదీష్ చంద్ర బోస్ కూడా రేడియోను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
రేడియో ప్రసారం 1923 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది రేడియో క్లబ్ ఆఫ్ బాంబే కింద ఉండేది. ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా 1956 నుంచి ఆకాశ్వాని అని పిలుస్తున్నారు. ఇది ప్రసార భారతి సంబంధించిన ఒక విభాగం.దీన్ని 1930 సంవత్సరంలో స్థాపించారు. జూన్ 8, 1936న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియో గా మారింది.
ప్రసార భారతి భారతదేశపు అతిపెద్ద ప్రజా ప్రసార సంస్థ. ఇది పార్లమెంటు ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్త సంస్థ. ఇది దూరదర్శన్ టెలివిజన్ నెట్‌వర్క్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్లను సమన్వయం చేస్తుంది.
👉వ్యాసకర్త యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ : 9492712836