జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి ఎంపీ అప్పలనాయుడు !

J.SURENDER KUMAR,

ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.


మంగళవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టులకు టోల్ ఫీజు మినహాయింపు అమలు జరిగితే సమాజ శ్రేయస్సు కోసం మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ఎంతగానో సహాయ పడుతుందన్నారు.