👉నేడు కార్గిల్ విజయ దినోత్సవ..
పొరుగు దేశమైన పాకిస్థాన్ తో క్రికెట్ అన్నా, యుద్ధం అన్నా, ప్రపంచ దేశాలలో ఒక రకమైన ఆసక్తి నెలకుంటుంది.1948 నుండి 1999 వరకు పలుమార్లు భారత్, పాకిస్థాన్ పరస్పరం యుద్ధంలో తల పడ్డాయి. చాలా సందర్భాలలో….
భారత్ శాంతియుతంగా వ్యవహరించింది.పాక్ నాయకత్వం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఆ దేశానికే తలనొప్పిగా మారింది.

కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే – జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం.యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టీ ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయ్యింది.
నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న వత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి

1998 -1999 ల మధ్య శీతాకాలములో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది. ఈ చర్యకి “ఆపరేషన్ బద్ర్” అని గుప్త నామం. దీని లక్ష్యం కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం, భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఉద్దేశం.
అయితే భారత్ పాక్ ఎత్తుగడలని సమర్ధవంతంగా తిప్పికొట్టింది.
మన సైనికులువీరోచితంగా పోరాడారు. వారి సేవలు సదా చిరస్మరణీయం.
👉వ్యాసకర్త ; యం. రాం ప్రదీప్, తిరువూరు,
మొబైల్ : 9492712836