👉ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్..
J..SURENDER KUMAR,
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్పై నోరు మెదుపుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆరోపణలు చేయడం ఎందుకో చెప్పాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ , లక్ష్మణ్ కుమార్ , వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మరికొందరు ఎమ్మెల్యేలు కెసిఆర్ తీరుపై ధ్వజమెత్తారు.
హైదరాబాదులో శాసనసభ భవన ప్రాంగణంలో గురువారం. వారు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 72 వేల కోట్లు ( వ్యవసాయ) రైతుల రుణమాఫీకి.31 వేల కోట్లు దళిత సంక్షేమం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇందిరమ్మ వీళ్లకు తదితర బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కేటాయించిన నిధులు కెసిఆర్ కు కనబడడం లేదా అని వారు ఆరోపించారు.
10 సంవత్సరాల కాలం పాటు బోగస్ మాటలు చెబుతూ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ బడ్జెట్ ను బోగస్ అనడం,
పచ్చకామెర్ల వాడికి ఊరంత పచ్చగా కనిపించినట్లు కెసిఆర్ మీడియా సమావేశం ఉందని వారు ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు.