👉మృతుల సంఖ్య పెరిగే అవకాశం !
👉సహాయక చర్యలలో సైన్యం !
J.SURENDER KUMAR,
కేరళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 54 మంది మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టడానికి సైన్యాన్ని ప్రభుత్వం రంగంలోకి దింపింది. వందలాది మంది చిక్కుకున్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో .. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వందల మంది కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు.
కేరళలోని మధ్య మరియు ఉత్తర జిల్లాలు మంగళవారం ఒంటరిగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ మరియు కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు (24 గంటల్లో 7-11 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
త్రిసూర్, పాలక్కాడ్, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, వాయనాడ్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కన్నూర్ జిల్లాలో, తలస్సేరి, ఇరిట్టి మరియు తాలిపరంబ తాలూకాలలోని విద్యాసంస్థలకు ప్రాంతీయ సెలవు ప్రకటించారు.