👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తన నియోజకవర్గంలో రాయపట్నం నుంచి ఆరేపల్లి వరకు గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి సమస్యను ఎమ్మెల్యే వివరించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణలో సాంకేతిక, విద్యుత్ వినియోగం, గోదావరి నీటి ప్రవాహం అంచనా తదితర అంశాలతో ముడిపడి ఉన్నందున సమస్యలు తలెత్తినప్పుడు రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని, గతంలో కొన్ని రోజులపాటు లిఫ్టులు పనిచేయని దుస్థితి ఏర్పడింది అన్నారు.

ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ చేపడితే, సమస్యలు ఏర్పడినప్పుడు సకాలంలో లిఫ్ట్ మరమ్మత్తులు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే వినతి పత్రంలో పేర్కొన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు నిధుల కోసం మంత్రులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, కొండ సురేఖకు వినతి పత్రం ఇచ్చారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు.