J.SURENDER KUMAR,
స్వర్గీయ దేవాదాయ శాఖ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు, సతీమణి శ్రీమతి సుమతి ప్రథమ సంవత్సరీకం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ లక్ష్మణ్ కుమార్, ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో బుధవారం మాజీ మంత్రి రత్నాకర్ రావు తనయులు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు, చంద్రశేఖర రావులు తల్లి సుమతి ప్రథమ సంవత్సరీక కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
