మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పరామర్శలు !

J.SURENDER KUMAR,


మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండలం జులపెల్లి కి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెమిని తండ్రి ఇటీవల మృతి చెందగా సోమవారం మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబుతో. కలసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


వెల్గటూర్ మండలం శాకపూర్ గ్రామానికి చెందిన కుమారి పూజిత ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామానికి చెందిన కొత్తపల్లి నవీన్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రోజున మృతి చెందాడు. ఎమ్మెల్యే కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
.