👉చత్తీస్ గడ్ అడవుల్లో ..
J.SURENDER KUMAR,
అదో కీ కారణ్యం కాకుల దూరని కారఅడవి ఏ క్షణం ఎటువైపు నుంచి తుపాకుల తూటాల వర్షం తమపై కురుస్తుందో, మందు పాతర్ల మారణ హోమంలో తాము సమిధలైపోతామో అని తెలిసి, అనుక్షణం యుద్ధభూమిలో ఆయుధాలు చేత పట్టుకొని అప్రమత్తంగా ఉంటూ డేగ కళ్ళతో గాలింపులు చేపడుతున్న కోబ్రా సాయుధ బలగాలు, ఆయుధాలను పక్కన పెట్టారు. ఆపదలో ఉన్న ఆ మాతృమూర్తిని, నవజాత శిశువు ప్రాణాలు కాపాడాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, హోరు వానలో, పొంగి పొర్లుతున్న ప్రవాహపు నదిని దాటుకుంటూ తల్లి నవజాత శిశు ప్రాణాలను కాపాడిన కోబ్రా సాయుధ బలగాల మానవత్వ ఆపరేషన్ చత్తీస్ గడ్ అడవుల్లో సోమవారం జరిగింది.

👉వివరాలు ఇలా ఉన్నాయి..
బీజాపూర్ జిల్లా నయపర గ్రామానికి చెందిన గిరిజన తెగ మహిళ పురిటి నొప్పులతో తల్లడిల్లిపోయింది ఆ మాతృమూర్తి, మద్వి ని (24). గ్రామస్థులు సుఖ ప్రసవం చేసినప్పటికీ, ఆమెది ప్రి మెచ్యూర్ ప్రసూతి కావడంతో తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్య చికిత్స అందించే అవకాశం అక్కడ లేదు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం నుండి బాలింత ను సురక్షితంగా ఆసుపత్రికి తీసుకుపోవడానికి రహదారి సౌకర్యం కూడా లేదు.

ఎడతెరిపి లేకుండా హోరున కురుస్తున్న వర్షం, నంబి, నయపర , గ్రామాల మధ్య పొంగి ప్రవహిస్తున్న ‘ నంబిధర’ నది, నయపర గ్రామ ప్రజలకు ఏం చేయాలో అర్థంకాక ఆందోళన పడుతున్నారు. ప్రి మెచ్యూర్ డెలివరి కావడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. నయపర గ్రామ ప్రజలు దేవుడి పై భారం వేసి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే స్థానిక 196 క్యాంపు , 205 కోబ్రా సాయుధ బలగాలు, తల్లి బిడ్డలకు వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రాణాలకు తెగించి సాహసం చేశారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న నది ఓవైపు, ప్రాణాపాయ స్థితిలో బాలింతరాలు నవజాత శిశు మరోవైపు, నది నుంచి దాటించేందుకు జవాన్లు ప్రాణాలకు తెగించి పకడ్భందీగా వ్యవహరించారు. వరద ఉధృతిలో తల్లి, నవజాత శిశువును తరలించేందుకు సిద్ధం చేసిన బల్లకట్టు కొట్టుకపోయే ప్రమాదం ఉందని గుర్తించిన జవాన్లు నదికి ఇరువైపుల వరకు దృఢమైన ( గట్టి ) తాడును ఏర్పాటు చేశారు. తాడు సహయంతో బలగాలు నది వరధ ఉధృతిలో నిలబెట్టి తల్లి బిడ్డను తరలించేందుకు ఉపయోగించిన బల్లకట్టును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాలింతను, నవజాత శిశువును, ఊసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

👉మావోయిస్టు నక్సల్స్ కోటలో…
మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు నయపరా గ్రామం కంచుకోట కావడం గమనార్హం. బాలింతను, ఆమె బిడ్డను సురక్షింతంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జవాన్లు వద్ద ఆయుధాలు లేవు, నిరాయుదులు, తుపాకుల తూటాల వర్షం కురిసినా , గ్రైనేడ్, లాంచర్ల తో దాడి జరిగిన, జవాన్లు ప్రాణాలు కోల్పోయే దుస్థితి.
అంతేకాకుండా నదిలో తాడు సహాయంతో తల్లి బిడ్డను ఒడ్డుకు చేర్చుతున్న క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న, ఉదృత నది వరద తాకిడీకి జవాన్లు ప్రవాహంలో కొట్టుకపోయే ప్రమాదం కూడా ఉండేది. తమ ప్రాణాల గురించి ఆలోచించకుండా, బాలింతరాలు ఆమె నవజాత శిశు కు సకాలంలో వైద్యం అందించాలనే లక్ష్యంతో దండకారణ్యంలో జవాన్లు అత్యంత సాహసోపేతంగా బాలింత ను, ఆమె బిడ్డను నది లో తరలిస్తున్న బల్లకట్టు చుట్టూ రక్షణ కవచంగా నిలబడి ఆసుపత్రికి తరలించడంలో సఫలం అయ్యారు. ప్రతికూల వాతావరణంలో జవాన్లు చూపిన మానవత్వం, చొరవను, సాహసం ను పలువురు వేనోళ్లు అభినందిస్తున్నారు.