J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అచ్చి రానున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకున్నది.
చర్చకు ప్రధాన కారణం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ పార్టీలకు ఉమ్మడి రాష్ట్రంలో, స్వరాష్ట్రంలోనూ ఆయా జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టారు.
👉వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, 1998 లో జాతీయ బిజెపి పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్, బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2023 వరకు కొనసాగారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనసాగుతుండగా. 2014 లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ కొనసాగారు.

స్వర్గీయ మాజీ మంత్రి ఏం సత్యనారాయణ రావు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 2000 నుంచి 2004 వరకు కొనసాగారు.

జాతీయ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి ( సిపిఐ పార్టీ కార్యదర్శిని అధ్యక్షుడిగా పరిగణిస్తారు ) 2014 లో ఎన్నికయ్యారు. ఆయా పార్టీలకు అధ్యక్షులు కొనసాగిన వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డలె.

సీఎం రేవంత్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి జూలై మాసంతో మూడు సంవత్సరాల కాలం పూర్తి కానున్నది. త్వరలో నూతన పిసిసి అధ్యక్షులు నియామకం ఏఐసీసీ చేపట్టనున్నదని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
👉ఏఐసీసీ పరిశీలనలో..
జాతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ,సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ నేతలు పిసిసి అధ్యక్ష పదవికి పలువురి పేర్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకగ్రీవంగా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఢిల్లీ అధిష్టానానికి సిఫారసు చేసినట్టు వార్త కథనాలు ప్రచార మాధ్యమాల్లో వ ప్రచురితమయ్యాయి.

ఎన్ ఎస్ యు విద్యార్థి సంఘ నాయకుడిగా, జెడ్పిటిసి సభ్యుడిగా, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా, ఉమ్మడి రాష్ట్రఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పార్టీ ఫిరాయించకుండా, టిఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, ఎమ్మెల్యేగా పలుమార్లు ఓడిన పార్టీలో కొనసాగుతు 2023 లో ధర్మపురి ఎమ్మెల్యేగా గెలిచిన లక్ష్మణ్ కుమార్ పేరు దాదాపు ఫైనల్ అయినట్టు చర్చ. ఏఐసీసీ అధికారికంగా లక్ష్మణ్ కుమార్ పేరు ప్రకటించితే. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాబితాలో మరో కరీంనగర్ ముద్దుబిడ్డ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పేరు చేరనున్నది.
