J. SURENDER KUMAR,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ వన మహోత్సవ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 46 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వ లక్ష్యం అని ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
వనం మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండల గ్రామాలైన తుమ్మెనాల, మద్దునూర్, అంబారీపేట గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…
వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను అలాగే వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అధికారులు కూడా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా అన్నారు.

రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశ్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవం పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.

వన మహోత్సవ కార్యక్రమంలో ఆయా మండలాల కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.