👉జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్!
J.SURENDER KUMAR,
నూతన పోలీస్ చట్టాలు, సైబర్ నేరాలు సామాజిక అంశాల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించే విధంగా పోలీస్ కళా బృందాలు చురుకుగా పనిచేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కళాబృందం సభ్యులు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరుగుదలతో పాటు సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుందని ఈ సైబర్ నేరాలు నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, అదేవిధంగా పోలీస్ చట్టాలు, సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నివారణ, డయల్ 100యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించే విధంగా చూడాలని కళ బృంద సభ్యులకు వివరించారు.