👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఓడిన గెలిచిన నాయకుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
స్వర్గీయ డాక్టర్ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు..

అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ….
ఉమ్మడి రాష్ట్రంలో పెద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి పెద ప్రజల గుండెల్లో చిర స్థాయిగా వైయస్ఆర్ నిలిచి ఉంటారని, లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రజలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే వారని, తను యువజన కాంగ్రెస్ నాయకుడు గా ఉన్నప్పుడు వారిని కలిసినప్పుడు వారు ఒక్కటే మాట అనేవారని ఓడిన గెలిచిన ఎల్లప్పుడూ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తుండే వారని, ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు వంటి ఎన్నో పథకాలు అమలు చేసిన మహానుభావుడని, వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సందర్భంగా కోరుకున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.