👉సర్పంచ్ ఎంపీటీసీ లకు…
J.SURENDER KUMAR,
స్థానిక సంస్థలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి పదవులకు ఓకే దశలో ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ కోసం సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం హైదరాబాదులో సమీక్ష నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణ, ఎన్ని దశలలో నిర్వహించాలి, పంచాయతీ సర్పంచ్, వార్డ్ సభ్యులు, ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలా ?
ఎంపీటీసీలు, జెడ్పిటిసి ఎన్నికలు మరోసారి నిర్వహించాలా ? నాలుగు పదవులకు కలిపి ఒకేసారి ఎన్నికల నిర్వహించాలా ? అని అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. పెద్ద మొత్తంలో ప్రభుత్వం పై ఆర్థిక భారం తో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే దశలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పడనున్న అవరోధాలు, ఉద్యోగుల సంఖ్య, అదనపు సిబ్బంది వివరాలను, బ్యాలెట్ బాక్సుల వివరాలు, జిల్లాల వారీగా సమాచారం కోరినట్టు తెలిసింది.
కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని సీఎం సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ ను సీఎం. ఆదేశించారు. బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం..