J.SURENDER KUMAR,
ధర్మపురి మండలం దొంతాపూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్ధ లక్ష్మణ్ ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పరామర్శించారు.
కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రికి వెళ్లి లక్ష్మన్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులతో వైద్యపరంగా, ఆర్థికంగా ఎలాంటి అవసరం ఏర్పడిన తనకు సమాచారం ఇవ్వాలని వారికి వివరించారు. లక్ష్మణ్ కు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు.