J.SURENDER KUMAR,
నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు పక్క భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ లో విద్య బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ వంటి తదితర అంశాల గూర్చి పాఠశాల అధ్యాపకులను ప్రశ్నించి సమాచారం సేకరించారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి పాఠశాలకు రావడం జరిగిందని, నియోజకవర్గంలో పక్క భవనాలు లేని పాఠశాల కు పక్క భవనాలు నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్పుల ఈశ్వర్ పక్క భవనాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
ధర్మపురి క్షేత్రాన్ని ఒ సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని, నియోజక వర్గంలో విద్య పరంగా ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, స్వయంగా నేనే పాఠశాలను తనిఖీ చేస్తానని, విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి పెద్ద పీట వేయడం జరిగిందనీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
👉పీరిలను దర్శించుకున్న ఎమ్మెల్యే !

మొహర్రం పండగ సందర్భంగా ధర్మపురి పట్టణంలోని స్థానిక మసీదులోనీ పీరిలను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.