పోలీసు జాగిలాల తో మాదక ద్రవ్యాల వేట !

👉జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్,


J.SURENDER KUMAR,

పోలీసు జాగిలాల ను ఉపయోగించి మాదక ద్రవ్యాల ఉనికిని కూడా తెలుసుకోవచ్చని జాగిలాల సేవలను పోలీస్ అధికారులు ఉపయోగించుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచనలు చేశారు.


జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న డాగ్ స్క్వాడ్ ( పోలీసు జాగిలాల ) ఎస్పీ బుధవారం సందర్శించి, జాగిలాల పని తీరును పరిశీలించారు. నేరస్తులను పసిగట్టడంలో పోలీస్ జాగిలాలు నిరంతరం విధులు నిర్వహిస్తూనే ఉంటాయన్నారు,
జిల్లాలో ఎన్నో రకాల కేసులను ఛేదించడంలో ఆధారాల సేకరణలో పోలీసు జాగిలాల (డాగ్ స్క్వాడ్ ) పనితీరు ప్రశంసనీయమని అన్నారు.

పోలీస్ జాగిలాల వాటికి సంబంధించి ఆహార, ఆరోగ్య నియమాల విషయాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటి సేవలను సద్వినియోగ పరుచుకోవాలని డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచించారు.


అనంతరం ఎస్పీ జాగిలాలు నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.