పోలీసుల అదుపులో మావోయిస్టులు !

👉కోర్టులో హాజరుపరచాలని డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్!


J.SURENDER KUMAR,


JMWP డివిజన్ లోని ఏటూరు నాగారం- మహదేవపూర్ దళంలోని నిరాయుధులైన ముగ్గురు సభ్యులు జై సింగ్, రమేష్ లను 29న , సుక్కిని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోలీసులు పట్టుకుని కనబడకుండా దాచిపెట్టి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ జారీ చేసిన ప్రకటన


వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరు పరుచాలి. వారికి ఏలాంటి హాని జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక నాయకులే బాధ్యత వహించాలి. ఈ అరెస్టును ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధి జీవులందరు ఈ అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి అని పత్రికా విలేకరులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.