ప్రభుత్వ భూముల ను కాపాడాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురికి సంబంధించిన ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని, అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని, రోడ్డు విస్తరణ పనులకు మరియు దేవాలయానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గురువారం ధర్మపురిలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించి తగు సూచనలు చేశారు. ధర్మపురి మున్సిపాలిటీలో ప్రజలు త్రాగు నీటి కొరకు డబ్బా నీటి పైన ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉందని, ఏదైనా పైప్ లైన్ లో సమస్య ఏర్పడితే మూడు నాలుగు రోజుల వరకు నీటి సరఫరా నిలిచి పోవడం జరుగుతుందని, డబ్బా పై ఆధారపడకుండా ఇతర ప్రత్యాన్మయాల పైన దృష్టి పెట్టి దానికి తగిన నివేదికలను అధించాలని, దానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అదే విధంగా గోదావరిలో మురికి నీరు కలవకుండా తగు చర్యలు తీసుకోవాలనీ, గృహ లక్ష్మీ పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు జిరో బిల్లు రావడం లేదని చాలా మంది నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, కరెంటు కోతలు లేకుండా చూసుకోవాలని,
సమీక్ష సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.