ప్రజల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,


బడుగు బలహీన పేద వర్గ ప్రజల సంక్షేమమే ప్రజా పాలన లక్ష్యమని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మారం మండలం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో మంగళవారం కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన 64 మంది లబ్ధదారులకు ₹ 64,07,424 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమ పథకాలు అన్ని ఆపివేస్తారని ప్రతి పక్షాలు దుష్ప్రచారం చేసిన ప్రజానీకం మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.

ప్రజల నమ్మకం కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతుందని, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని, ఈ విడుతలో కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, మరో విడతలో వచ్చేల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.