ప్రారంభానికి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం మంత్రి, ఎమ్మెల్యే కు పాలాభిషేకం!

J.SURENDER KUMAR,

గత కొన్ని సవత్సరాలుగా మూతపడిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాల పునః ప్రారంభానికి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు, విద్యావేత్తలు యువకులు కాంగ్రెస్ శ్రేణులు శనివారం పట్టణంలో ఘనంగా పాలాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..


బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2021 లో మూతపడిన ఆరు దశాబ్దాల చరిత్ర గల నైట్ కాలేజీ తిరిగి ప్రారంభించే విషయంలో చొరవ తీసుకున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. కళాశాల నిర్వహణకు సాలిన ₹ 35 లక్షల రూపాయల నిధులను వివిధ దేవాలయల నుండి కళాశాలకు కేటాయిస్తూ జీవో విడుదల కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు వీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనపట్ల దినేష్, ఉపాధ్యక్షులు వేముల రాజేష్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సింహరాజు ప్రసాద్, జక్కు రవీందర్, రఫీక్, గరిగే రమేష్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం తిరుపతి, సుముఖ్, చిపిరిచెట్టి రాజేష్, రాపర్తి సాయి, అశెట్టి శ్రీను, గుడ్లరవి, రాపర్తి రమణ, కాసెట్టి రాజేష్, గాజు సాగర్, సంగనబట్ల నరేందర్, గోపి, ప్రశాంత్, గణేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.