👉బాలిక ను రేప్ చేసిన నిందితునికి 25 సంవత్సరముల జైలు శిక్ష !
👉బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం !
J.SURENDER KUMAR,
బాలికలపై అత్యాచారం చేసిన నిందితుల పాలిట జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం సింహ స్వప్నంగా మారారు. అత్యాచార నిందితులకు చట్టపరంగా న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడే విధంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పక్కాగా సాక్షాలను సేకరించడమే కాకుండా, సాక్షులు న్యాయస్థానంలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే వాతావరణం, వారికి పోలీసు యంత్రాంగం పట్ల నమ్మకం విశ్వాసం కలిగించేలా కౌన్సిలింగ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫలితంగా మూడు అత్యాచార సంఘటనలలో న్యాయమూర్తి ఒక నిందితుడికి 60 సంవత్సరాలు, మరో నిందితుడికి 20 సంవత్సరాలు, బుధవారం మరో నిందితుడికి 25 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షలు వేయించ గలిగారు.

👉వివరాల్లోకి వెళ్ళితే,
గత కొన్ని రోజుల క్రితం న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై జరిగిన హత్యాచారం కేసులో Cr No. 484/2020 లొ నిందితుడు కే .రమేష్ బాబుకు. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, విధిస్తూ బాధితురాలికి ₹ 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
👉గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లో 2022 ఏప్రిల్ 7న నమోదైన ముగ్గురు బాలికలపై అత్యాచారం కేసులో ఒక్కొక్క కేసులో నిందితుడు కొడిమ్యాల హరికృష్ణ కు 20 సంవత్సరాలు చొప్పున. న్యాయమూర్తి శ్రీమతి నీలిమ 60 సంవత్సరాలు కఠిన గారాగార శిక్ష విధించింది. బాధిత బాలికలు ఒక్కరికి ₹ 3 లక్షల పరిహార ఇవ్వాలని ఆదేశించింది.
👉బాలికపై అత్యాచారం సంఘటనలో నిందితుడికి బుధవారం 25 సంవత్సరాలు శిక్ష పడిన వివరాలు ఇలా ఉన్నాయి
పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో మైనర్ బాలికను నిందితుడు కొలిపాక అంజయ్య (66) అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడి పై పోక్సో చట్టం కింద పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. డిఎస్పి లు వెంకటస్వామి, రఘు చంధర్ విచారణ చేశారు. 6 నెలల లోపే Fast track special Court కి ఆధారాలు సమర్పించారు. పిపి కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ బుధవారం నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష మరియు ₹ 5000/- జరిమాన, బాధిత బాలికలకు ₹ 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ … సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ వేగవంతగా జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.
పై కేస్ లో నిందితునికి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ మల్లికార్జున్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా డిఎస్పి లు వెంకటస్వామి, రఘు చంధర్, ఎస్సై సతీష్ , CMS ఎస్.ఐ రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ సాగర్, మరియు CMS కానిస్టేబుల్స్ కిరణ్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.