👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ప్రభుత్వం త్వరలోనే రైతులకు ₹ 2 లక్షల రుణాలను ఏకకాలంలో మాఫి చేస్తాం అని, రైతులకు మేలు జరిగే అంశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం అరపెల్లి గ్రామంలో జైన సొసైటి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎరువుల గోదామును శనివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ముందుగా గ్రామంలోని చెరువును మండల నాయకులు, అధికారులతో కలసి పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామంలోనీ గంగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
రైతాంగానికి మేలు జరిగే విధంగా ఆరేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల గోదామును ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఎరువుల గోదాము చాలా ఉపయోగపడుతుందని, ఎరువుల స్టాక్ కి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇటీవల వరి ధాన్యం కొనుగోలు లో కూడా ఎటువంటి తరుగు లేకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా కొనుగోలు చేశామన్నారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు జరగకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. రైతులకు మేలు జరిగే విషయంలో పార్టీలకు అతీతంగా సూచనలు, సలహాలు స్వీకరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు

.
👉కొలువాయి ఆరేపల్లి భూముల పరిశీలన!
కొన్ని సంవత్సరాల నుండి బీర్పూర్ మండలం చిన్న కొల్వయి గ్రామ గిరిజనులకు, ధర్మపురి మండలం అరేపెల్లి గ్రామస్తులకు వివాదం పరిష్కారం కోసం జగిత్యాల ఆర్డిఓ రెవెన్యూ అధికారులతో వివాదాస్పద భూమిలోనే ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.

వివాదంలో ని 110 ఎకరాల భూ సమస్యపై పరిష్కారం కోసం రెవిన్యూ అధికారుల సహకారంతో ఇరు వర్గాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా భూ సమస్యను పరిష్కరిస్తామని దానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు