👉మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విన్నపం !
👉ఎమ్మెల్యేలు లక్ష్మణ్ కుమార్, విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ !
J.SURENDER KUMAR,
ఈ నెలలో ఆరంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా సింగ్ లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి నిధుల వివరాలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు.
తెలంగాణ సచివాలయంలో మంగళవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు తో కలసి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలిసి పలు అంశాలు మంత్రికి వివరించారు.

ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన పత్తిపాక రిజర్వాయర్, లింగాపూర్ , మరియు మ్యాదర గండి, జంగనాల ప్రాజెక్ట్ లాంటి మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణ పనుల వివరాలను లక్ష్మణ్ కుమార్ మంత్రికి వివరించారు.

సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు కృషి చేస్తామని,దాంతోపాటు పత్తిపాక రిజర్వాయర్ సంబంధించిన విషయంలో పెండింగ్ ఉన్నటువంటి ₹ 7 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయాలని వారి దృష్టికి తీసుకెళ్లగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.