సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించండి !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

నా నియోజకవర్గంలో అర్ధాంతం గా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, అదనంగా తాను కోరిన తాగునీటి మరియు సాగునీటి రిజర్వాయర్ కార్యక్రమంలో నిర్మాణానికి నిధులు కేటాయించాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం హైదరాబాదులోని జల సౌధలో నీటిపారుదల రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.