సాంకేతిక విద్యావంతుడు.. సంగీత పాటల సామ్రాజ్యంలో ఏకలవ్యుడు !

👉తెలుగు ఇండియన్ ఐడియల్ పోటీలకు ధర్మపురి యువకుడు కుశాల్ ఎంపిక !

👉15 వేల మంది పోటీపడ్డారు 12 మంది గాయకులు ఎంపికయ్యారు !

J.SURENDER KUMAR,

సరిగమలు నేర్చుకోలేదు.. సంగీత సాధన చేయలేదు.. విద్యావంతుడు, ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నాడు. పలు పాటలు విన్నాడు పాడుతూ.. పాడుతూ ‘పాడుతా తీయగా’ పోటీలకు ఎంపికై పాటల ప్రపంచ గాయకులలో ప్రకంపనాలు సృష్టించాడు.. ఆ గాయకుడే ధర్మపురి క్షేత్రానికి చెందిన రావులపల్లి కుశాల్,
ఇండియన్ ఐడియల్ కు ఎంపికయ్యాడు.


👍వివరాల్లోకి వెళ్తే..


ధర్మపురి కి చెందిన రావులపల్లి ( చిన్న ) వెంకటరమణ జ్యోతి, దంపతుల కుమారుడు కుశాల్. చదువులో చురుకైనవాడు. హైదరాబాదులో బిటెక్ పూర్తి చేశాడు. సరిగమలు సంగీతం నేర్చుకోలేదు. సరదాగా స్నేహితుల ప్రోద్బలంబలంతో పాడుతా తీయగా ఆడిషన్ లో పాల్గొని పాటల ప్రపంచంలో రాజ్యమేలుతున్నడు.


👉తెలుగు ఇండియన్ ఐడియల్ కు….


దేశ, విదేశాల నుండి తెలుగు ఇండియన్ ఐడియల్ పోటీలలో దాదాపు15 వేల మంది పాల్గొన్నారు. నిర్వాహకులు ఆరు ఆడిషన్ రౌండ్స్ నిర్వహించి చివరగా 12 మందినీ చేశారు. వారిలో ధర్మపురి కి చెందిన రావులపల్లి కుశాల్ సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ప్రతిమా శశిధర్ గురువు వద్ద సంవత్సరం నుండి సంగీతం నేర్చుకుంటున్నాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, గాయని గీతా మాధురి, ప్రముఖ గాయకుడు కార్తీక్ న్యాయ నిర్ణయతులుగా వ్యవహరిస్తున్నారు. యాంకర్ గా శ్రీరామచంద్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.


ఈ పాటల పోటీ కార్యక్రమం ‘ఆహా ఓటీపీ ‘
( Aha OTT ) ఛానల్ లో ప్రతి శుక్ర, శనివారాలు రాత్రి 7 గంటల నుండి ప్రసారం అవుతాయి. గత నెల జూన్ 28, 29 ప్రారంభమయ్యాయి.