👉నేడు ప్రపంచంలో టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ పుట్టిన రోజు !
****
సంతానలేమి సమస్యతో సతమతమవుతున్న దంపతులు, తల్లిదండ్రులు కావడానికి టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ వంటి చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. సరోగసీ అనేది సంతానం లేని దంపతులు తమ బిడ్డను కనడానికి ఇష్టపడే ఒక సరోగసీ తల్లిని నియమించుకునే ప్రక్రియ. సరోగసీ ద్వారా బిడ్డను కనడం వెనుక చాలా కారణాలున్నాయి.
ఉదాహరణకు, దంపతులు తమ స్వంత పిల్లలను పొందలేకపోతే లేదా, ఒక స్త్రీ తనకు బిడ్డను కలిగి ఉండకూడదనుకుంటే. తన కడుపులో మరో బిడ్డను మోసే స్త్రీని సరోగేట్ మదర్ అంటారు.
పిల్లలు కలగక వేధన అనుభవిస్తున్నవారికి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఒక వరం అనే చెప్పాలి. సహజంగా ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోతే.. ముందుగా వైద్యులు ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్ ప్రయత్నిస్తారు.

అందులోనూ ఫెయిల్ అయితే చిట్టచివరిగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సజెస్ట్ చేస్తారు. ఐవీఎఫ్ చికిత్సా విధానంలో 45 నుంచి 50 శాతం వరకు సక్సెస్ రేట్ ఉంది.
ఇందులో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి.. బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది, ఆ తర్వాత.. పిండం బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17- 20 రోజుల సమయం పడుతుంది. అయితే, పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది.

లూయిస్ జాయ్ బ్రౌన్ 1978జులై 25న జన్మించింది. గర్భం దాల్చిన తర్వాత ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ప్రయోగం ద్వారా జన్మించిన మొదటి మానవురాలుగా పేరు పొందింది . ఆమె జననం 20వ శతాబ్దపు అత్యంత విశేషమైన వైద్య పురోగతిగా చెప్పబడుతుంది.
👉వ్యాసకర్త; యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ :9492712836