J.SURENDER KUMAR,
పెగడపెల్లి , ధర్మారం మండలలోని మద్ధులపల్లి,ఏడు మొటలపల్లి , బంజేరుపల్లి, కొత్తపల్లి గ్రామంలో నిర్వహించే బంజారాల ఆరాధ్య దైవం సీత్ల భవాని పండగ వేడుకల్లో మంగళవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మద్దులపల్లిలో సీత్ల భవాని దేవాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ వెల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అమ్మవారి దేవాలయ నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని, పెగడపెల్లి మండలానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

👉వనమహోత్సవం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను అలాగే వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని,మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,అధికారులు కూడా నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.