J.SURENDER KUMAR
ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ – పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.
శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును సభ ముందుంచారు.
విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.