J.SURENDER KUMAR,
గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాచుపల్లి లోని శ్రీ షిరిడి సాయిబాబా నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నిర్వాహకులు మెట్ పల్లి కి చెందిన శ్రీనివాస్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కొల్హాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ హనుమంత రావుతో కలసి సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు వీరిని ఆశీర్వదించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందించి శేష వస్త్రంతో సన్మానించారు..