J.SURENDER KUMAR,
తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టిక్కెట్ల కేంద్రం, దాతల విభాగం ఏర్పాటు కోసం టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్యచౌదరి, తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, అధికారులతో కలిసి పలుచోట్ల స్థలాలను పరిశీలించారు.
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మరింత సౌకర్యవంతంగా టిక్కెట్లు జారీ చేసేందుకు, పార్కింగ్ సౌకర్యంతో కూడిన ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసేందుకు టీటీడీ యోచిస్తోంది.

ఇందులో భాగంగా అడిషనల్ ఇఓ నేతృత్వంలోని అధికారుల బృందం గోకులం విశ్రాంతి భవనం వెనుక, టిటిడి కల్యాణ మండపం స్థలం పక్కనే ఉన్న ఆదిశేషు విశ్రాంతి భవనం, డిఎఫ్ఓ కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం నూతనంగా పునరుద్ధరించిన అన్నమయ్య భవన్‌ను అడిషనల్ ఈఓ పరిశీలించారు.ఎస్ఈ 2 జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో సెల్వం, రవాణాశాఖ జీఎం శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
👉స్వామి పుష్కరిణి ఆగస్ట్ 1-31 వరకు మూసివేత !

క్లీనింగ్ మరియు పునరుద్ధరణ పనుల కోసం ఆలయ ట్యాంక్, స్వామి పుష్కరిణిని ఆగస్టు 1 నుండి 31 వరకు ఒక నెల పాటు మూసివేయనున్నారు.
ప్రతి ఏటా వచ్చే వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిణి మరమ్మతులు, శుభ్రత పనులు చేపట్టడం ఆనవాయితీ. మొత్తం నీటిని బెయిల్ అవుట్ చేసి, బురద తొలగింపు, మెట్లను శుభ్రపరచడం, చెత్తను రవాణా చేయడం, పైపులకు పెయింటింగ్ వేయడం, దెబ్బతిన్న పాయింట్లను మరమ్మతు చేయడం వంటి కొన్ని పనులు చేపట్టబడతాయి.
పనులు పూర్తయ్యే వరకు పుష్కరిణి మూసేయనుంది. భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని టిటిడి ప్రకటనలో పేర్కొంది.