ఎస్ ఆర్ ఎస్ పి నుంచి కాలువలకు నీరు వదలండి!

👉అధికారులకు రైతాంగం విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

ఉత్తర తెలంగాణ జిల్లాల రైతాంగానికి వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల కు నీటిని వరి నాట్ల కోసం వదిలి ఆదుకోవాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకు ఈ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తారు.
ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం20.370 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు (80 టీఎంసీలు) ఆదివారం నాటికి ప్రాజెక్టు లో 1074.7 అడుగులు ( 32.138 టీఎంసీలు) నిల్వ ఉంది. సోమవారం సాయంత్రానికి నీటి నిల్వలు 36 టీఎంసీల కు చేరుకున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తే వరి నాట్లు ముమ్మరం కానున్నాయి.

👉ఎస్ ఆర్ ఎస్ పి కి 61 సంవత్సరాలు పూర్తి!

1963 జులై 26న అప్పటి ప్రధాని ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. 1978 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈ ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గా నామకరణం చేశారు. 18 లక్షల ఎకరాల సాగుకు, 112 పిఎంసిలు సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టులో ఇసుక మేటల పూడికతో ప్రస్తుతం 90 టీఎంసీలకే పరిమితమైంది. ఉత్తర తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటి విడుదలకు ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించాలి అని రైతులు కోరుతున్నారు.