👉 ధర్మపురి ఆలయ అధికారుల తీరే వేరు !
👉 వందలాది భక్తులు ఉన్న ఆంధ్ర భక్తుడే బాధిత భక్తుడి పై ఫిర్యాదా ?
👉 సీసీ కెమెరాలు పనిచేయడం లేదా ?
👉 ఉద్యోగులకు సంజాయిషి నోటీసులు ఎందుకు జారీ చేశారో ?
👉 ఉచిత అన్నదాన పంపిణీ టోకెన్ జారీ రికార్డులలో భక్తుడీ వివరాలు లేవా ?
👉 24 గంటల తర్వాత ఆంధ్ర ప్రాంత భక్తుడితో ఫిర్యాదా ?
J.SURENDER KUMAR,
భక్తులు దేవుళ్లకు సమర్పించే మొక్కుల, కానుకల
డబ్బులతోనే దేవాలయాలలో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల
జీవనం కొనసాగుతుందనే కృతజ్ఞతా భావాన్ని విడనాడి
భక్తుడి పై దాడికి పాల్పడి, బాధిత భక్తుడే ఉద్యోగుల పట్ల
దురుసుగా ప్రవర్తించాడని ఆంధ్ర ప్రాంతానికి చెందిన భక్తుడినీ
అడ్డుపెట్టుకొని ఎదురు దాడి చేస్తూ ధర్మపురి ఆలయ అధికారి
జారీ చేసిన వివరణ విస్మయ పరుస్తున్నది.
👉 వివరాల్లోకి వెళితే..
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఉచిత అన్నదాన మంటపంలో భోంచేస్తున్న భక్తుడు, దొడ్డు బియ్యం అన్నం ను ప్రశ్నించగా, కొందరు ఉద్యోగులకు, భక్తుడికి మధ్య జరిగిన వివాదంలో కుటుంబ సభ్యుల సమక్షంలో భక్తుడి పై జరిగిన దాడి సంఘటన తెలిసిందే.
👉 ఈ ఓ వివరణ..
కొందరు ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఆలయంలో జరిగిన దాడి సంఘటన అంశంపై శుక్రవారం ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని ఫోన్ లో వివరణ కోరారు. ఈ.ఓ తాను అందుబాటులో లేనని, మీటింగ్ లో ఉన్నాను అంటూ కొందరు జర్నలిస్టులకు, మరికొందరు జర్నలిస్టుల ఫోన్లకు స్పందించలేదు. మరో జర్నలిస్టుకు దాడి జరగలేదు, పరస్పరం నెట్టుకున్నారు అంటూ, ఈ ఓ ఇచ్చిన వివరణ అంశాన్ని కూడా ప్రింట్ మీడియా కథనాలలో ప్రచురితమైంది.
👉 తెలంగాణ భక్తుడి పై ఆంధ్ర భక్తుడి ఫిర్యాదు !
భక్తుడే ఆలయ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఎంత చెప్పినా వినకుండా తనకు ఇష్టమైన కూరలు కావాలని, అక్కడ పని చేసే ఆడవారితో వాదన పెట్టుకున్నాడని, ఆంధ్ర ప్రాంతం పల్నాడు జిల్లా, దాచేపల్లి కి చెందిన ఎర్రమల్ల సత్యనారాయణ, శుక్రవారం (19/07/2024) కార్యనిర్వహణాధికారికి భక్తుడి పై చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొంటూ, భక్తుడే ఆలయ ఉద్యోగుల పట్ల పదే పదే దురుసుగా ప్రవర్తించాడని, ఉద్యోగులు ఏమీ అనలేదని, అన్నదానం శుచి, రుచిగా, ఉందని ఫిర్యాదు లేఖలో కితాబు ఇచ్చాడు.
👉 ఇష్టమైన కూర కోసం డిమాండ్ చేస్తాడా?
స్వామి వారి ఉచిత అన్నదాన ప్రసాదంలో తనకు ఇష్టమైన కూర కావాలని భక్తుడు ఎలా డిమాండ్ చేస్తాడో ? అంతు పట్టని ఆరోపణ.
👉 ధర్మపురి ఆలయ ఇంచార్జ్ ఈ ఓ వివరణ !
(ఉన్నది ఉన్నట్టు ప్రచారం మాధ్యమాల్లో పోస్టింగ్)
” మీడియా సోదరులకు మనవి, నిన్న భక్తునిపై దాడి విషయం లో వచ్చిన పత్రిక న్యూస్ లో, సోషల్ మీడియాలో వార్త లో వచ్చిన వాటి విషయం లోసంఘటన జరిగిన రోజు ఆ సమయం లో ఉన్న సిబ్బందినీ, భక్తులను,ప్రాథమికంగా విచారణ చేయగా మేము ఎవరము భక్తునిపై దాడి చేయలేదని అది వాస్తవమైన విషయం అని ఒక భక్తుడు అన్నదానం లో భోజనం చేసి అన్నం దొడ్డుగా ఉందని తెల్పుతూ అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వివాదానికి దిగగా అక్కడ ఉన్న సిబ్బంది మీరు ఏమైనా ఉంటే పైన ఆఫీస్ లో కంప్లయింట్ ఇవ్వండి అంటే అతను పైన ఆఫీస్ లో కి వచ్చి అక్కడ ఉన్న సిబ్బందితో కూడా గొడవ పెట్టుకొని నాన దుర్భాషలాడి అందరినీ వ్యక్తిగతంగా తిడుతుంటే వారిని మీరు తిట్టవద్దు మీరు పిర్యాదు ఇవ్వండి లేదా వెళ్ళండి అని నెట్టినాము అని తెల్పినారు, కానీ దాడి అనే విషయం అవాస్తవం, సత్య దూరమైన విషయం అని తెలిపినారు, మరియు ఆ సమయం లో ఉన్న పల్నాడు జిల్లా దాచేపల్లి కి వాస్తవ్యులు శ్రీ సత్య నారాయణ అనే భక్తున్ని నేడు సంప్రదించి విచారణ చేయగా పూర్తిగా అవాస్తవం, ఆ భక్తుడే సిబ్బంది నీ దుర్భాషలాడినాడిని తెలిపినారు,”
ఈ నేపథ్యంలో శనివారం ( 20/07/2024 ) ఇంచార్జ్ ఈ ఓ తన కార్యాలయంలో ఆ భక్తుడి వివరణను వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ, తన వివరణ కూడా దాడి సంఘటన అవాస్తవం అంటూ పోస్ట్ చేశాడు.
👉 ఉద్యోగులకు సంజాయిషి నోటీసులు ఎందుకో ?
భక్తుడే ఆలయ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు అనే ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో
( శుక్రవారం ఆలయంలో పర్యవేక్షణ, అన్నదాన తదితర జరిగిన తదితర అంశాలలో ) కొందరు ఉద్యోగులకు శనివారం ఇన్చార్జి ఈవో సంజాయిషీ నోటీసులు ఎందుకు ఇచ్చారో ? అనే అంశం చర్చలకు అవకాశం కల్పించింది.
👉 నిత్యం 200 మందికి పైగా ఉచిత అన్నదానం !
ఆలయంలో నిత్యం దాదాపు 200 మందికి పైగా భక్తులు అన్నదాన ప్రసాదం విడతల వారీగా దాదాపు 60 మంది ( స్థల భారంతో) భోంచేస్తుంటారు. పగలు స్వామివారి నివేదన తర్వాత ఉచిత అన్నదానం మొదలవుతుంది. వందలాది మంది భక్తులు అక్కడే ఉండగా పల్నాడు జిల్లాకు చెందిన ఆంధ్ర ప్రాంత భక్తుడే, బాధిత భక్తుడి పై ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటో ? ఆంధ్ర ప్రాంత బర్త్డే చెప్పాల్సి ఉంటుంది.
👉 భక్తుల వివరాలు పరిశీలించారా ?
ఆలయంలో ఉచిత అన్నదానానికి టోకెన్ల జారీ సందర్భంలో భక్తుడి పేరు, ఊరు, జిల్లా ఫోన్ నెంబర్ విధిగా నమోదు చేసి భక్తులకు టోకెన్లు జారీ చేస్తారు. ఉచిత అన్నదానానికి భక్తులు విరాళాలు అందిస్తే సైతం వారి ఊరు, పేరు, ఫోన్ నెంబర్లు, ఇచ్చిన మొత్తం నమోదు చేస్తారు. ఆ రికార్డులు పరిశీలిస్తే. బాధిత భక్తుడి ఊరు, పేరు, ఫోన్ నెంబర్ తెలిసే అవకాశం ఉంది, ఆ కోణంలో అధికారులు విచారిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
👉 సీసీ కెమెరా ఫుటేజ్ లు ఎక్కడ ?
సాలీనా కోట్లాది రూపాయల ఆదాయం కలిగి ఉండి, నిత్యం వేలాది భక్తజనంతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణంలో ప్రధానంగా భక్తుల భద్రత కోసం, వారి ఆస్తుల రక్షణ, పర్యవేక్షణ కోసం, ఆలయం బయట, లోపల వెనకవైపు భద్రత చర్యల నేపథ్యంలో లక్షలాది రూపాయలు ఆలయ నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ లను అధికారులు పరిశీలించారా ? సీసీ కెమెరాలు పనిచేయడం లేదా ? ఒకవేళ భక్తుడే దురుసుగా ప్రవర్తించి ఉండి ఉంటే, అతడి ప్రవర్తనను, సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలను, ఇంచార్జ్ ఈవో, ప్రచార మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఉంటే. ఆంధ్ర భక్తుడు తెలంగాణ భక్తుడి పై చేసిన ఫిర్యాదుకు మరింత బలం ఉండేదని, ఆలయ సిబ్బంది ఎలాంటి దాడికి పాల్పడలేదనే నగ్నసత్యం భక్తజనంకు తెలిసి ఉండేది. సి సి పుటేజ్ లు ఎందుకు బహిర్గతం చేయడం లేదో ? అనే అంశం అధికారులే వివరించాల్సి ఉంది.
👉 ఎవరు నీలమ్మ ? ఎవరు అంజలి ?
ఆలయ ఉద్యోగుల పట్ల భక్తుడి దురుసు ప్రవర్తన పై ఇంచార్జ్ ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన పత్రంలో. ఇట్లు, ఎర్రమల్ల సత్యనారాయణ, పల్నాడు జిల్లా, దాచేపల్లి అని ఉంది. రెండవ పేరులో నీలమ్మ అని ఉంది. పేరు పక్కన అంజలి అంటూ రెండుసార్లు ఉంది. నీలమ్మ ఎవరో ? అంజలి ఎవరో ? ఆలయ అధికారులే స్పష్టత ఇవ్వాలి. ఫిర్యాదు పత్రం వ్రాసింది ఎవరో ? ఫిర్యాదు పత్రంలో ఈ పేర్ల పక్కన గల సంతకాలు పరిశీలిస్తే దాడికి సంబంధించిన వాస్తవాలను అవగాహన చేసుకునే అవకాశం ఉంది.

👉బాధిత భక్తుడి పై ఫిర్యాదు పత్రంలో…
👉 1. సంఘటన జరిగిన రోజున (19/07/2024) ఆంధ్ర భక్తుడు ఫిర్యాదు చేశాడు!
👉 2. ఫిర్యాదు పత్రంలో ఇష్టమైన కూరలు కావాలని సిబ్బందిని డిమాండ్ చేశాడు అని ఉంది!
👉 3. ఫిర్యాదు పత్రంలో నీలమ్మ అనే పేరు ఉంది!
👉 4. అంజలి అంటూ రెండుసార్లు సంతకం ఉంది!
👉 5. ఫిర్యాదు దారుడు సత్యనారాయణ సంతకం తీరు ఇలా ఉంది!
👉 6. ఫిర్యాదు పత్రంపై 20/07/2024 న పుటప్ అని ఇనిషియల్ ఉంది!

👉 ఫిర్యాదుదారుడు. సత్యనారాయణ తో అతడి వివరణను ఇంచార్జ్ ఈవో 20/07/2024 న వీడియో రికార్డింగ్ చేస్తున్న దృశ్యం.
👉సంఘటన జరిగిన రోజున ఫిర్యాదు పత్రం ఎందుకు బహిర్గతం చేయలేదు ?
భక్తుడి పై దాడి సంఘటన అంశం ప్రచారమాధ్యమాలు. రావడం, పలువురు ఆయా పత్రికల జర్నలిస్టులు దాడి సంఘటనపై అధికారిని ఫోన్ ద్వారా వివరణ కోరారు. సంఘటన జరిగిన తరువాత ఆంధ్ర ప్రాంతానికి చెందిన భక్తుడు. ఉద్యోగుల పట్ల బాధిత భక్తుడి దురుసు ప్రవర్తనపై ఈవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆలయ నిర్వహణ తీరు ,కొందరు ఉద్యోగుల ప్రతిష్టకు భంగం కలిగించే సంబంధించిన అంశంలో బాధిత భక్తుడు చేసిన ఆరోపణలకు కౌంటర్ గా ( అతడి ప్రవర్తన గూర్చి ) అతని పై తోటి భక్తుడు చేసిన ఫిర్యాదు లేఖను ఇంచార్జ్ ఈవో ఎందుకు ప్రచారం మాధ్యమాల్లో పోస్ట్ చేయలేదో ? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు సైతం ఎందుకు మౌనం వహించారో ? ఈ లేఖను వాట్సప్ ద్వారా ఈవోకు ఎందుకు పంపించలేదో ? అంతుచిక్కని చిదంబర రహస్యం అనే చర్చ నెలకొంది.
👉చర్యలకు జంకుతున్న ప్రభుత్వ యంత్రాంగం ?
ధర్మపురి ఆలయ నిర్వహణ తీరు, అవినీతి అవకతల పై బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం జంకుతున్నట్టు సమాచారం. భక్తుడి పై దాడికి పాల్పడ్డ వారిపై కూడ ఎలాంటి చర్యలు ఉండవు అనే చర్చ భక్తులలో మొదలైంది.

ఇందుకు అనేక కారణలతో పాటు గత సంవత్సరం లో వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రావు, సిబ్బందితో ఈ ఆలయంలో 4/10/2023 న ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పలు అవినీతి, అక్రమాలు, అవకతవకల తో పాటు లక్షలాది రూపాయల విలువ గల దిట్టం లో (ప్రసాదాలు, ఉచిత అన్నదానం ,స్వామివారి నివేదనకు వినియోగించే నిత్యవసర సరుకులు). అవకతవకలు గుర్తించి ఇక్కడీ అధికారులకు 18-10-2023 న రెండు సంజాయిషి నోటీసులు జారీ చేసి, దాదాపు సంవత్సర కాలం సమీపిస్తున్న బాధ్యులైన అధికారి, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తో ప్రభుత్వ యంత్రాంగమే వీరికి జంకుతున్నట్టు భక్తులలో చర్చ నెలకొంది. దీనికి తోడు 20-03-2023 న బీర్పూర్ ఆలయ నిధులు దుర్వినియోగం పై కూడా సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

భవిష్యత్తులో ఆలయంలో వసతి సౌకర్యాలు, స్వామివారి ప్రసాదాల నాణ్యత తీరును, సమయపాలన, తదితర అంశాలపై ప్రశ్నించనున్న భక్తులకు, ఆలయ పరిరక్షణ సమితి సభ్యులకు, నాయకులకు, శుక్రవారం భక్తుడి పై జరిగిన దాడి ఓ హెచ్చరిక లాంటిదనే చర్చ నెలకొంది.
భక్తుడిపై దాడి అంశం భవిష్యత్తులో ఏమి జరగనున్నదో వేచి చూడాల్సిందే!