తెలంగాణ నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ కు శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.


సీఎం తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ,డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు , ఇతర ఉన్నతాధికారులు కూడా స్వాగతం పలికినవారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా నూతన గవర్నర్ సాయుధ దళాలు గౌరవ వందనం స్వీకరించారు.