J.SURENDER KUMAR,
జూలై 9, 16 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన జారీ చేసింది.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కారణంగా ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు.
జూలై 8 మరియు 15 తేదీల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని ప్రకటనలో కోరారు.
👉పోటు కార్యకలాపాలపై ఈవో సమీక్ష !

శుక్రవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఈవో జె శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి పోటు కార్యక్రమాలపై సమీక్షా నిర్వహించారు.
అందులో భాగంగానే, వైష్ణవ, బ్రాహ్మణ మరియు వైష్ణవ బ్రాహ్మణేతర వర్గాల్లోని లడ్డూల తయారీ కోసం వారి జాబ్ చార్ట్‌తో సహా, మానవశక్తి వివరాలను సుదీర్ఘంగా అధ్యయనం చేశాడు. బూందీ ఫ్రై, షుగర్ సిరప్ మరియు జీడిపప్పు ఫ్రై, బూందీ మిక్సింగ్, లడ్డూ మౌల్డింగ్, ట్రే లిఫ్టింగ్, కన్వేయర్ బెల్ట్, ప్రసాదం పంపిణీ మరియు మరెన్నో పిపిటి ద్వారా సంబంధిత అధికారులు సమర్పించారు.
ఆలయ డీఈవో లోకనాథం, ఏఈవో పోటు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
