తిరుమలలో భక్తుల సౌకర్యాలను పరిశీలించిన ఈవో శ్యామలరావు!

J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 1,2 లో వేచి ఉన్న భక్తుల సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె. శ్యామల రావు  శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. దీంతోపాటు  వివిధ కంపార్ట్‌మెంట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై వారితో ఈ . ఓ స్వయంగా మాట్లాడారు.


వైకుంఠం డిస్పెన్సరీని పరిశీలించి అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు పాలు అందజేయడాన్ని ఈఓ పరిశీలించారు.  మరుగుదొడ్లు, కంపార్ట్‌మెంట్ గేట్లు తెరవడానికి అటెండర్ల ఉనికి, ఫ్యాన్‌లు, లైట్లు, టెలిఫోన్‌ల పనితీరు, ఎల్ఈడీ స్క్రీన్‌లపై ప్రసారమవుతున్న ఎస్‌వీబీసీ కార్యక్రమాలు, కంపార్ట్‌మెంట్ల విడుదల సమయాల గురించి యాత్రికుల సమాచారం ప్రదర్శించడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈవోతో పాటు సీఈ  నాగేశ్వరరావు, ఎస్ఈ2  జగదీశ్వర్‌రెడ్డి, డీఈ ఎలక్ట్రికల్‌ రవిశంకర్‌రెడ్డి, ఆలయ డీఈవో  లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.


టీటీడీ అన్నప్రసాదం సిబ్బందికి, హోటళ్ల వ్యాపారులకు, ఇతర విక్రయదారులకు ఆహార భద్రతా చర్యలపై త్వరలో ఆహార భద్రత విభాగం అధికారులు శిక్షణ ఇవ్వనున్నట్లు  ఈవో  శ్యామలరావు తెలిపారు.  శ్రీవాణి దాతల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్టు దర్శనం టిక్కెట్‌ జారీ కౌంటర్‌ను దాతల గది పక్కనే ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి గోకులం విశ్రాంతి భవనం వెనుక శాశ్వత నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.  అనంతరం ఆలయ ప్రాంగణం, తిరుమల నంబి ఆలయం, బయోమెట్రిక్ పాయింట్‌లను అధికారులతో కలిసి పరిశీలించారు.


👉ప్రాణదాన ట్రస్ట్‌కు ₹1.5 కోట్ల విరాళం !


తిరుమల, 26 జూలై 2024: తెనాలికి చెందిన శ్రీ సత్య శ్రీనివాస్, నేషనల్ స్టీల్స్ CFO SV
ప్రాణదాన ట్రస్ట్‌కు  ₹1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం టిటిడి ఈవో  జె.శ్యామలరావుకు దాత చెక్కును అందజేశారు.