టీపీసీసీ అంతర్జాతీయ సమన్వయకర్తగా దేవేందర్ రెడ్డి!

J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ప్రవాస భారతీయుల విభాగంలో అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్తగా ప్రముఖ ఎన్నారై నంగి దేవేందర్ రెడ్డి నియమితులయ్యారు.

టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లకు దేవేందర్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

 
ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. వందకు పైగా దేశాలకు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం తెలంగాణ వాసులు వలస వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను మాతృభూమి తెలంగాణతో అనుసంధానం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృషి చేస్తానని నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.