ఉద్యోగం వచ్చిందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు !

👉ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో యువతతో సీఎం రేవంత్ రెడ్డి !


J. SURENDER KUMAR,

ఉద్యోగం వచ్చిందని మీ మీద ఆశలు పెట్టుకున్న కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయొద్దు అంటూ ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో యువతకు బాధ్యతలు గూర్చి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్‌మెన్ లకు వివరించారు.
తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు.


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

👉అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని సీఎం అన్నారు.


👉ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని, ఆ తర్వాత డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం గుర్తుచేశారు.


👉చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా సీఎం వివరించారు.


👉అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌ లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.


👉 ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని అన్నారు.


👉ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారిచ్చే సూచనలు అమలు చేయడానికి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.


👉ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.