👉రాష్ట్ర మంత్రుల సమక్షంలో…
J.SURENDER KUMAR,
కరీంనగర్ లోని వి కన్వెన్షన్ లో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం పై ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రైతులతో మంత్రులు అభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు లతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కవితలు పాల్గొన్నారు.
👉దళితులకు మిగులు భూమి పంపిణీ చేయండి!

నియోజకవర్గంలో మిగులు భూములను అర్హులైన దళిత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లె, ఖిలావనపర్థి, నర్సింగపూర్, కమ్మరికాన్ పేట గ్రామాలతో పాటు ధర్మపురి మండలం గాదెపెల్లి, ఆరపెల్లి గ్రామాలలో మిగులు భూములను అర్హులైన దళిత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరుతూ కరీంనగర్ లో ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు.