వద్దు అంటే ఎమ్మెల్యేలు వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు!

👉మా పార్టీ నాయకత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


మా పార్టీకి అసెంబ్లీలో అత్యధిక మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మా పార్టీలోకి వద్దు అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారు కలుస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించడం లేదు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు.


👉 సమావేశ ముఖ్యాంశాలు..


👉 సోమవారం జగిత్యాలో జరిగిన బిఆర్ఎస్ పార్టీకి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, కాంగ్రెస్ పార్టీ పై మాజీమంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు.


👉 దళిత సిఎం, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, రుణమాఫీ వంటి హామీలు మీరు ఎందుకు అమలు చేయలేదు


👉మీరు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే మీకు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెట్టలేదు.


👉మీ ప్రభుత్వ హాయంలో బేరసారాలు చేసి భట్టి విక్రమార్క నాయకత్వములో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లను మీ పార్టీలో చేర్చుకున్న విషయం ప్రజలకు మర్చిపోలేదన్నారు.

👉10 సంవత్సరాల పాటు రాచరిక పాలన కొనసాగించినా కొనసాగించిన కేసీఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పారు.

👉మీ ప్రభుత్వంలో ఏ మిల్లర్ అయినా రైతుల వడ్లను తరుగు లేకుండా కొనుగోలు చేశాడా ?మీరు ఇచ్చిన హామీలలో ఏవి అమలు చేశారో జగిత్యాల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ప్రమాణం చేసి చెప్పండి అంటూ డిమాండ్ చేశారు.

👉తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకునే విధంగా కెసిఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నారు, కేటీఆర్ కాబోయే సిఎం అని ప్రచారం చేసినా బి.ఆర్.ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడికి పోయారు అంటూ ప్రశ్నించారు.

👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు గ్యారెంటీలు అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే అమలు చేసి తీరుతాం. త్వరలోనే రైతులకు రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేసి తీరుతాం అని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉దేవుడు నోరు ఇచ్చాడు కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు.దళిత సిఎం,దళితులకు 3 ఎకరాల భూమి,కేజీ టు పీజీ విద్య,రుణమాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు


👉గత ప్రభుత్వంలో సిఎం నీ కలిసే అవకాశం ఎవరికైనా ఉందా,కానీ ఇప్పుడు ఎవ్వరైనా ముఖ్యమంత్రి గారిని కలిసి వారి సమస్యలు విన్నవించుకొనే స్వేచ్చ ఉంది.


👉ప్రశ్న పత్రం లీకేజి విషయంలో KTR పిఎ ఉన్నడని తెలిసిన అతని పైన ఎందుకు విచారణ జరిపించలేదు, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి,
i


👉 కొప్పుల ఈశ్వర్ సతీమణి నాయకత్వంలో ఏర్పాటు చేసిన జాబ్ మేలలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో ? శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి, గత ప్రభుత్వంలో ఒక మంత్రి హోదాలో కొనసాగి కూడా ధర్మపురి కి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు.

👉 మీ ప్రభుత్వం లో ఇక్కడి నీళ్ళు సిరిసిల్ల, సిద్ధిపెట, గజ్వేల్ కి తీసుకెళ్తున్న పట్టించుకోరు, ధర్మపురిలో ఐటీఐ కళాశాల లేదు, డిగ్రీ కళాశాలలో లేదు, పాలిటెక్నిక్ కళాశాలలో లేదు, బస్ డిపో లేదు అని ఆరోపించారు.
మీడియా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు