విధులను బహిష్కరించిన న్యాయవాదులు !

J.SURENDER KUMAR,


ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు.

సిద్దిపేట న్యాయవాది యం. రవి కుమార్ పై అక్కడి టు టౌన్ ఎ ఎస్ ఐ మంగళవారం దాడి చేసిన ఘటనకు సంబంధించి అడ్వకేట్ ఫెడరేషన్ తెలంగాణ తీసుకున్న చర్యల్లో భాగంగా ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదికి సంఘీభావంగా బహిష్కరించారు.


👉ఎమ్మెల్యేను కలిసిన న్యాయవాదులు !


ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మపురి కోర్టు న్యాయవాదులు. గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన ధర్మపురి కోర్టు ఏజీపీ గా నియమితులైన రౌతు రాజేష్ న్యాయవాదులతో కలసి ఎమ్మెల్యేను శాలువతో సన్మానించారు.