J.SURENDER KUMAR,
ఆదానీ కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులను చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో హైదరాబాదులో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఏఐసీసీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసనల నేపథ్యంలో గురువారం టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు చేపట్టిన నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మరియు మంత్రులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు, అనంతరం ED కార్యాలయం ఎదుట చేపట్టించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు..
👉గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి!

గెస్ట్ లెక్చరర్స్ లను రెగ్యులరైజ్ చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా గెస్ట్ లెక్చరర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.